Header Banner

వేసవిలో తిరుమల పర్వతాలపై హిమవతం.. పొగ మంచుతో ఆహ్లాదకర వాతావరణం! భక్తులకు విభిన్న అనుభూతి!

  Fri Mar 14, 2025 16:36        Devotional

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు సమ్మర్ లో డిఫరెంట్ వెదర్ ఆకట్టుకుంది. పొగ మంచు కప్పేసిన తిరుమల కొండల్లోని వాతావరణం భక్తులు, ప్రకృతి ప్రేమికుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. తిరుమల ఘాట్ రోడ్ లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడేలా దట్టమైన అటవీ ప్రాంతాన్ని పొగ మంచు దట్టంగా అలుపుకోవడం చూసిన భక్తులకు వింత అనుభూతి కలిగింది. తిరుమల కొండ కు వెళుతున్న భక్తులు పొగ మంచు, మేఘాలతో పై నుంచి పూర్తిగా కనిపించని తిరుపతి నగరం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎక్కడికక్కడ వాహనాలను ఆపి భక్తులు పోటో షూట్ కు దిగారు. ఒకవైపు ఈ నెల మొదటి వారం నుంచే ఉదయం 10 గంటల కంతా ఎండలు దంచి కొడుతుంటే ఈ రోజు తిరుమల గిరులకు చేరే భక్తులకు కనిపించిన వెదర్ వారికి కొత్త అనుభూతికి కారణమైంది. తిరుమల కొండలను పొగమంచు కమ్మేసింది. అప్పుడే మొదలైన ఎండాకాలంతో రాష్ట్రవ్యాప్తంగా అప్పుడే ఎండలు దంచికొడుతుంటే.. తిరుమలలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. తెల్లవారు జామున మంచు కమ్మేసి.. చల్లటి వాతావరణం భక్తులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఫోటోలు, సెల్పీలు దిగుతూ సందడి చేశారు.


ఇది కూడా చదవండి: బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


వీధుల్లో పరిగెత్తుతున్న కుక్క.. నోట్లో పసికందు..! కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!


ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ!


అదిరిపోయిన కూటమి వ్యూహం! ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచేందుకు ఓటింగ్ కూడా అవసరమయ్యేలా లేదుగా!


వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #thirupathi #thirumala #snow #todaynews #flashnews #latestnews